Ways to travel Kotappakonda Shivaratri 2023


కోటప్పకొండకు రావుటకు మరియు తిరిగి వెళ్ళుటకు మార్గములు :-
1. నరసరావుపేట నుండి కోటప్పకొండ కు వయ యలమంద, గురవైపాలెం నుండి వచ్చువారు స్నానాల ఘాట్ ప్రకన గల : పార్కింగ్ కు చేరుకోనవలెను. నర్సరీ మార్గం ద్వార యాదవుల సత్రం ప్రకన గల జనరల్ పార్కింగ్ కు వెళ్ళవలెను...
2. రెడ్ల సత్రం వైపు నుండి వెళ్ళు నుండి నరసరావుపేట కి వెళ్ళు ట్రాఫిక్ చిలకలూరిపేట మేజర్ కెనాల్ మీద ఏర్పాటు చేసిన రూట్ లో మాత్రమే వెళ్లవలయును. గురవాయపాలెం, యల్లమంద మీదుగా అనుమంతించబడదు.
3. VIP పాస్ ఉన్నవారు నరసరావుపేట వైపు నుండి వచ్చు వారు పెట్లూరివారిపాలెం గ్రామం. మీదుగా ఘాట్ రోడ్డు ప్రక్కన గల VIP పార్కింగ్ నందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకొని, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన బస్సులలో మాత్రమే కొండ పైకి చేరుకోవలయును.
4. VIP మరియు జనరల్ పార్కింగ్ నుండి తిరిగి వెళ్ళు ట్రాఫిక్ కొండకావూరు, పమిడిమర్రు, మీదగా JNTU వద్ద నరసరావుపేట, వినుకొండ హైవే పైకి చేరుకొని తిరిగి వెళ్ళవలెను.
5. చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు నుండి కోటప్పకొండకు వచ్చు ప్రజలు చిలకలూరిపేట, పురుషోత పట్నం, పోతవరం, మద్దిరాల, యడవల్లి, UT. జంక్షన్, శారద ఫార్మసీ కాలేజీ వద్ద గల పార్కింగ్ కు చేరుకోనవలెను.
6. కోటప్పకొండ నుండి తిరిగి చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు చిలకలూరిపేట పోవు వారు UT జంక్షన్ నుండి కట్టుబడివారిపాలెం,కమ్మవారిపాలెం గ్రామాల మీదుగా చెరువు రోడ్డు లో చిలకలూరిపేట మీదగా వెళ్లవలయును.
7. సంతమాగులూరు మండలం మరియు అద్దంకి మండలం నుండి శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చు వారు మన్నేపల్లి నుండి లక్ష్మీ పురం, పెట్రువారిపాలెం, మీదగా ఘాట్ రోడ్ ప్రక్కన గల జనరల్ పార్కింగ్ కు వెళ్ళవలెను.
8. సంతమాగులూరు మండలం మరియు అద్దంకి మండలం నుండి ప్రభలు వద్దకు వచ్చు వారు. మన్నేపల్లి, తంగేడుమల్లి, గురిజేపల్లి, U.T. గ్రామాల మీదగా ప్రభల నిధికి చేరుకోవలెను.
9. మన్నేపల్లి నుండి కోటప్పకొండ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు.
10.AM రెడ్డి కాలేజీ ఎదురుగా గల పోలీసు చెక్ పోస్ట్ నుండి కోటప్పకొండ వైపు వాహనములకు అనుమతి లేదు.
11. చిలకలూరిపేట నుండి ప్రభల వద్దకి వచ్చు ట్రాఫిక్ యడవల్లి నుండి అట్టల ఫ్యాక్టరీ ఎదురుగా గల రోడ్డు నుండి కట్టుబడివారిపాలెం మీదుగా ప్రభల నిధి వద్దకు చేరుకోనవలయును.
12. VIP పాస్ ఉన్నవారు చిలకలూరిపేట నుండి UT సెంటర్ నుండి క్రషర్స్ మార్గం గుండా VIP vehicle parking చేరుకోనవలయును.